ఎన్టీఆర్ కు అరుదైన గౌరవం
వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఖాతాలో మరో అవార్డు వచ్చి చేరింది. 2016 సంవత్సరానికి గానూ ఉత్తమ నటుడిగా వరుసగా పలు అవార్డులు అందుకున్న నందమూరి కుర్రోడు మరో ప్రతిష్టాత్మక అవార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా ప్రకటించిన సైమా(సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) అవార్డుల్లో ఉత్తమ నటుడి అవార్డును అందుకున్న తారక్ ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహాన్ని నింపాడు. సైమా ( సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) అవార్డ్స్ ఫంక్షన్ అబుదాబీలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు దక్షిణాది సినీ పరిశ్రమలకు చెందిన పలువురు తారలు సందడి చేశారు.













