‘నేనే రాజు నేనే మంత్రి’ ట్రైలర్ విడుదల
రానా , తేజ దర్శకత్వంలో తెరకెక్కిన నేనే రాజు నేనే మంత్రి లో జోగేంద్ర గా కనిపించనున్నాడు. ఈ చిత్ర ట్రైలర్ ఈరోజు విడుదలైంది. రానా ట్రైలర్‌ను ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. రానా సరసన కాజల్, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తుండగా డి. సురేష్ బాబు, కిరణ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో రానా రాజకీయ నాయకుడి గెటప్‌లో అదరగొట్టేస్తున్నాడు. ‘వందమంది ఎమ్మెల్యేలను స్టార్ హోటల్లో కూర్చోబెడితే సాయంకాలానికి నేను అవుతా సీఎం’ అంటూ పొలిటికల్ సెటైర్స్‌ను విసురుతున్నాడు జోగేంద్ర.








