ఆగస్ట్ 3 నుంచి బాలకృష్ణ-కె.ఎస్.రవికుమార్ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం !!
“శ్రీరామరాజ్యం, సింహా” వంటి బ్లాక్ బస్టర్ల అనంతరం బాలకృష్ణ సరసన నయనతార నటించనుండడం విశేషం. రాంప్రసాద్ గారు ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వర్తించనుండగా.. బాలయ్య 100వ చిత్రమైన “గౌతమిపుత్ర శాతకర్ణి” చిత్రానికి సంగీత సారధ్యం వహించి చారిత్రక విజయంలో కీలకపాత్ర పోషించిన చిరంతన్ భట్ ఈ చిత్రానికి కూడా సంగీతం సమకూర్చనుండడం విశేషం. రామోజీ ఫిలింసిటీలో భారీ సెట్ ను నిర్మించాం. ఆగస్ట్ 3 నుండి 30 రోజులపాటు ఇక్కడే చిత్రీకరణ జరగనుంది, కీలకపాత్రధారులతో కీలకసన్నివేశాలు చిత్రీకరించేందుకు దర్శకుడు కె.ఎస్.రవికుమార్ ప్లాన్ చేస్తున్నారు” అన్నారు.













