వేసవి కానుకగా వాసుకి
నయనతార కథానాయికగా శ్రీరామ్ సినిమా పతాకంపై ఎస్.ఆర్.మోహన్ తెలుగులో అందిస్తున్న చిత్రం వాసుకి. సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధమైన ఈ చిత్రం గూర్చి నిర్మాత మాట్లాడుతూ తెలుగు నేటివిటీని ప్రతిబింబిస్తూ భారీ స్థాయిలో రూపొందించిన ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేశామని, ఈ నెలాఖరుకు సెన్సార్‌కు పంపనున్నామని, వేసవి కానుకగా మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరె: వర్గిస్రాజ్, సంగీతం: గోపీసుందర్, నిర్మాత: ఎస్.ఆర్. మోహన్, మాటలు: వెంకట్ మల్లూరి, పాటలు: భువనచంద్ర, వెన్నెలకంటి, దర్శకత్వం: ఎస్.కె.షాజాన్.













