మెగాస్టార్ కు జోడీగా నయనతార
దాదాపు దశాబ్దకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఖైదీనెం 150తో ఘనంగా పునరాగమనం చేశారు. అనంతరం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తన 151లో సినిమాను కూడా ప్రకటించేశారు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రంలో ఆయన నటిస్తున్నారు. దీనికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి టైటిల్‌నే అనుకుంటున్నారు. ఇందులో చిరంజీవికి జోడీగా నయనతార ఎంపికైంది. ఈ సినిమాకి ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్‌పై రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ నుంచి ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.













