నయనకు బాలీవుడ్ చాన్స్?
గ్లామర్ భామ నయనతార ఈ మధ్య సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఇప్పటికే లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో సత్తాచాటుకున్న ఈ అమ్మడు కథకే ప్రాధాన్యత ఇస్తూ, హీరోగా కమెడియన్ ఉన్నా కూడా హీరోయిన్గా నటించేందుకు ఓకే చెబుతోంది. ఇక మరోవైపు ఘాటు ప్రేమాయణం సాగిస్తున్న ఈ అమ్మడుని త్వరలో పెళ్లిచేసుకోవాలని విగ్నేష్ శివన్ ప్లాన్ చేస్తున్నాడు. కానీ ఇంకా సినిమాలు చేయాలనీ ప్లాన్ చేస్తున్న ఈ అమ్మడికి బాలీవుడ్ నుండి పిలుపు వచ్చిటన్లు తెలుస్తోంది. నిజానికి ఆ మధ్య ప్రభుదేవాతో ప్రేమాయణం సాగించిన నయనతార అప్పుడే బాలీవుడ్లో సినిమా చేయాల్సింది కానీ ఆ తర్వాతి కాలంలో ప్రభుదేవాతో విడిపోవడం వల్ల కుదరలేదు. తాజాగా నిర్మాత విషుభగ్నానీ నయనతారకు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బాలీవుడ్లో రూపొందించే సినిమాలో హీరోయిన్గా నటించమని అడిగాడని, దాంతో పాటు భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కూడా తమిళ సినిమాకు రీమేక్ అని తెలుస్తోంది. మరి ఈ విషయంపై నయనతార ఏ జవాబూ చెప్పలేదని టాక్.













