అమెరికాలో నాని నిన్ను కోరి షూటింగ్
హీరో నాని దూకుడు పెంచారు. తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన నేను లోకల్ చిత్రం తర్వాత మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్.ఎల్.పి పతాకంపై దానయ్య డి.వి.వి నిర్మిస్తున్న ఆ చిత్రం ‘నిన్ను కోరి’. నేను లోకల్ విడుదలైన రోజునే ప్రారంభమైన ఈ చిత్రం సరిగ్గా నాలుగు నెలల తర్వాత అంటే జూన్ 23న విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ చిత్రంతో మరో కొత్త దర్శకుడు శివ నిర్వాణకు అవకాశం ఇస్తున్నారు నాని. నివేదాథామస్ హీరోయిన్. చిత్రం ప్రోగ్రెస్‌ను ఆయన వెల్లడిస్తూ అమెరికాలో షెడ్యూల్ పూర్తయింది. ఈ నెల 17 నుంచి వైజాగ్‌లో షూటింగ్ జరుగుతోంది. ఈనెల 29 వరకు జరిగే షూటింగ్‌తో ప్యాచ్‌వర్క్ మినహా చిత్రం పూర్తవుతుంది. మిగిలిన కార్యక్రమాలు పూర్తి చేసి జూన్ 23న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని తెలిపారు.













