ఎన్టీఆర్ పాత్రకు బాలయ్యే కరెక్ట్
ఎన్టీఆర్ జీవిత చరిత్ర (బయోపిక్)పై నిర్మిస్తున్న సినిమా దర్శకుడెవరో ఇంకా నిర్ణయించలేదని ఆంధ్రప్రదశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి లోకేశ్ తెలిపారు. విజయవాడలో జరిగిన పార్టీ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ బయోపిక్కు రామ్గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారన్న వార్తలను ఆయన దృష్టికి తేగా, లోకేశ్ దానిని తోసిపుచ్చారు. మాకుటుంబ సభ్యులమంతా ఇటీవల పోర్చుగల్ వెళ్లాం. ఎన్టీఆర్ జీవిత చరిత్రపై సినిమా తీయాలని అక్కడే చర్చించుకున్నాం. ఎన్టీఆర్ పాత్రలో మామయ్య బాలకృష్ణ నటిస్తారు. ఇక దర్శకుడెవరైనా ఒక్కటే బాలయ్య ఉంటే సినిమా సూపర్ హిట్ అని అన్నారు. ఎన్టీఆర్ చరిత్ర తెరపైకి ఎక్కడం ఎంతో సంతోషకరమని తెలిపారు. ఈ సినిమాపై త్వరలోనే సృష్టత వస్తుందన్నారు.













