‘నాకు మనసున్నది’ చిత్రం పాటలు విడుదల….
సోనిటీమ్ సమర్పణలో సాయి హాసిని ప్రొడక్షన్ పతాకం ఫై సుజయ్, తనిష్క్, చంద్రకాంత్, రష్మీ హీరో హీరోయిన్లు గా సోని ప్రధాన పాత్రలో నాకు మనసున్నది, అనే ఈ చిత్రాన్ని నూతన నిర్మాత, దేవశంకర్ గౌడ్ నిర్మించగా రాజశేఖర్ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రం ఆడియోలాంచ్ ఆదివారం సాయంత్రం ప్రసాద్ లాబ్ లో జరిగింది.ముఖ్యఅతిథిలుగా ప్రతాని రామకృష్ణగౌడ్,సాయి వెంకట్,సినీనటుడు బానుచందర్,సినీనటి కవిత, తుమ్మలపల్లి రామసత్యనారాయణ గార్లు విచ్చేశారు.ట్రైలర్ ను ప్రతాని రామకృష్ణ గౌడ్, బిగ్ సి డి ని కవిత ,సీడీ బానుచందర్ విడుదల చేసి చిత్ర యూనిట్ కు అందజేసారు.
రామకృష్ణ గౌడ్,మాట్లాడుతు .. ఈ సినిమాలో నటించిన నటీనటులు అందరికి నా శుభాకాంక్షలు రాజశేఖర్ ఈ సినిమాను చాలా బాగా చిత్రీకరించారు ప్రొడ్యూసర్ కి మంచి బిజినెస్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు.
సాయి వెంకట్ గారు మాట్లాడుతూ.. ఈ సినిమాలో అందరిని అభినందిస్తున్నాను .ట్రైలర్ చూసాము టైటిల్ నాకు మనసున్నది తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని నిర్మించారు .దెయ్యం మ నుషుల్ని ప్రేమించడం కొత్త కాన్సెప్ట్ ఇది మంచి సినిమా అవుతుంది అని అన్నారు.
కవిత గారు మాట్లాడుతూ..నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే దర్శకుడు టెక్నీషియన్స్ అందరిని చిన్నచిన్న పిల్లలును తీసుకుని వారితో చేయించారు అని అన్నారు.
బానుచందర్ మాట్లాడుతూ…చిత్ర దర్శకుడు రాజశేఖర్ ని ప్రొడ్యూసర్.దేవశంకర్ గౌడని అభినందించారు ఈ సినిమా మంచి హిట్ అవుతుందని అవ్వాలని నేను కోరుతూ సెలవు తీసుకున్నారు.
ఈ కార్యక్రమం అనంతరం దర్శకనిర్మాతలు. అందరికికృతజ్ఞతలు తెలియజేసారు.
ఇంకా ఈ చిత్రం లో అప్పారావు, సూర్య,సతీష్, నవ్వుల వినోద్, యర్రంశెట్టి వీరన్న,నట నరసింహ, బేబీ హాసిని, నవ్య,ఐరెన్లెగ్ ప్రసాద్, లక్ష్మి,రాజు తదితరులు నటిస్తున్న చిత్రానికి డి.ఓ.పి.. పెద్దాడ వెంకట రమణ,లిరిక్స్..మణికుమార్ దుల్లా, రాజు,సంగీతం..ఉదయకిరణ్,ఎడిటింగ్..చందు ఐశ్వర్య













