ఆయన రాజకీయాల్లోకి వస్తే విజయం సాధిస్తారు
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి అడుగుపెడితే కనుక మంచి విజయం సాధిస్తారని అఖిల భారత మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, సీనియర్ నటి నగ్మా అన్నారు. చైన్నైలో రజనీకాంత్‌ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశానని నగ్నా తన ట్వీట్లో పేర్కొన్నారు. తనకు ఇష్టమైన నటుడు, భాషా సినిమా నుంచి తనకు మంచిమిత్రుడైన రజనీకాంత్‌ను కలిశానని, పలు అంశాలపై తాము చర్చించుకున్నామని ఆమె తెలిపారు.








