అక్టోబర్ 6న మా పెళ్లి
నాగచైతన్య-సమంతల పెళ్లి తేదీ నిశ్చయమైంది. నిన్న మొన్నటి వరకూ అక్టోబర్‌లో పెళ్లి ఉంటుంది కానీ, ఇంకా డేట్ అనుకోలేదని చెప్పుకుంటూ వచ్చారు చైతు. జియో ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ వేడుక ఈ నెల 17న హైదరాబాద్‌లో జరగనుంది. ఈ వేడకకు సంబంధించిన వివరాలు తెలియజేయడానికి ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముఖ్య అతితిగా చైతు పాల్గొన్నారు. మా పెళ్లి అక్టోబర్ 6న అని ఈ వేదికపై చైతూ పేర్కొన్నారు. అది మాత్రమే కాదు, సమంతతో తాను మరో రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్లో నటించాలనుకుంటున్నట్లు కూడా పేర్కొన్నారు. న్యూయార్క్‌ని హనీమూన్ ప్లేస్‌గా సెలెక్ట్ చేసుకున్నారు ఈ కాబోయే దంపతులు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ఏ మాయ చేశావె కి సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించింది అక్కడే. అందుకే హనీమూన్‌ని అక్కడ ప్లాన్ చేసుకున్నారు.













