వైభవంగా నాగచైతన్య, సమంత పెళ్లి
అక్కినేని నాగార్జున ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన కొడుకు సినీ నటుడు నాగచైతన్య, నటి సమంత మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. నాగచైతన్య, సమంత వివాహం శుక్రవారం అందాల తీరం గోవాలో వైభవంగా జరిగింది. వెగాటర్ బీచ్‌లోని డబ్ల్యూ రిస్టార్‌లో హిందూ సాంప్రదాయం ప్రకారం రాత్రి 11:52 నిమిషాలకు సమంత మెడలో నాగచైతన్య తాళి కట్టారు. అక్కినేని రామనాయుడు కుటుంబసభ్యులు సహా సినీ రంగానికి చెందిన పలువురు వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. శనివారం సాయంత్రం 5:30 నుంచి 6:30 మధ్య ఇక్కడే క్రైస్తవ సంప్రదాయ పద్ధతిలో నాగచైతన్య-సమంత మరోసారి పెళ్లి ప్రమాణాలు చేయనున్నారు.













