‘మేడమీద అబ్బాయి’ ఫస్ట్‌లుక్ విడుదల
కామెడీ చిత్రాల కథానాయకుడు అల్లరి నరేష్ నటిస్తున్న తాజా చిత్రం “మేడమీద అబ్బాయి”. జాహ్నవి ఫిల్మ్స్ పతాకంపై బొప్పన చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. నిఖిల విమల్ కథానాయిక. జి.ప్రజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో ఘన విజయం సాధించిన ‘వరు వడక్కన్ సెల్ఫీ’ చిత్రానికి రీమేక్ ఇది. శనివారం ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఒక మేడపై వాటర్ గ్లాస్‌తో పక్కన బైనాక్యులర్ పెట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ అల్లరి నరేష్ కూర్చోగా, మరో మేడపై నిఖిలా విమల్ కాఫీ కప్పుతో ఉన్న ఫస్ట్‌లుక్ ఆకట్టుకుంటోంది. షాన్ రెహమాన్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు.













