నా జీవితాంతం నిన్ను ప్రేమిస్తూనే ఉంటా
ఆమెని జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను అంటున్నారు మంచు మనోజ్. ఇంతకీ ఆమె ఎవరో కాదు మనోజ్ సతీమణి ప్రణతి. ఈ రోజు ప్రణతి పుట్టినరోజు. ఈ సందర్బంగా మనోజ్ స్నేహితులు, సన్నిహితులు సమక్షంలో తన భార్య బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మనోజ్ తన సతీమణికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, నా మనసు దోచుకున్న ఆమెకి హ్యాపీ బర్త్డే. నా జీవితాంతం నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను అని పేర్కొంటూ బర్త్డే వేడుకల ఫొటో షేర్ చేశారు. మనోజ్, ప్రణతి 2015 మేలో పెళ్లి చేసుకున్నారు. మనోజ్ అభిమానులు, ఫాలోయర్లు ఈ పోస్ట్ పై స్పందిస్తూ ప్రణతికి బర్త్ డే విషెస్ తెలిపారు. వీరి జీవితం ఎంతో ఆనందంగా సాగిపోవాలని మరికొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.













