మహేశ్‌బాబు ‘స్పైడర్’ టీజర్ విడుదల
అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మహేష్ బాబు ‘స్పైడర్’ టీజర్ విడుదలైంది. మహేశ్‌బాబు ఈ టీజర్‌ని ట్విటర్లో విడుదల చేశారు. ఇందులో హీరో మహేష్ కంప్యూటర్ల ఎదుట కూర్చుని హ్యాకింగ్ చేస్తూ ఉండడం టీజర్లో మనం చూడవచ్చు. అందులో ఓ స్పైడర్ రోబోలా కనిపిస్తూ మహేష్ మీదకు పాకుతుంది.. అప్పుడు ఏదో పనిలో ఉన్న మహేశ్ పక్కకు తిరిగి ష్…. అని సౌండ్ చేయడంతో స్పైడర్ అక్కడే ఆగిపోవడం హైలైట్‌గా నిలిచింది. ఇందులో మహేశ్‌కి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు హారిస్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. దసరాకి ‘స్పైడర్’ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.








