ఈరోజు తనకి ఎంతో ప్రత్యేకం : మహేష్
ప్రిన్స్ మహేశ్ బాబు గారాలపట్టి సితార ఈరోజు ఐదో పుట్టినరోజు జరుపుకుంటోంది. ఈ సందర్బంగా మహేశ్ తన గారాలపట్టికి సోషల్‌మీడియా ద్వారా విషెష్ చెప్పారు. తనతో రోజు నాకు ప్రత్యేకమే. ఈ రోజు తనకి ప్రత్యేకం. నాచిట్టి తల్లి ఇలాగే ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. నా కూతురు ఈ రోజు ఐదో పుట్టినరోజు జరుపుకొంటోంది అని ట్వీట్ చేస్తూ కూతురితో దిగిన ఫొటోను షేర్ చేశారు. మహేశ్ సతీమణి నమత్ర తన గారాలపట్టి సితార పుట్టినరోజు గురించి రెండు రోజుల క్రితమే ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. సీతార పట్టు పరికిణీలో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ, 5 సంవత్సరాల వైపు అమె (సితార)అని రాశారు. సితార పుట్టినరోజు సందర్భంగా ఆమె చేతికి గోరింటాకు పెట్టుకుని తన సోదరితో దిగిన ఫొటోను నమ్రత తాజాగా అభిమానులతో షేర్ చేశారు. సితార పుట్టినరోజు సందర్భంగా మహేశ్‌బాబు తాజా చిత్రం స్పైడర్ టీజర్‌ను విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది.













