తలసానిగారికి ‘మా’ తరుపున కృతజ్ఞతలు: శివాజీ రాజా
సింగిల్ విండో విధానంలో షూటింగ్ లకు అనుమతులు… ఆన్ లైన్ టికెంటింగ్ ప్రభుత్వం పోర్టల్ ను లాంచ్ చేసిన సందర్భంగా `మా` మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా హర్షం వ్యక్తం చేశారు.
`ఇకపై షూటింగ్ అనుమతులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా..అలాగే బ్లాక్ టికెట్ల దందా నిలువరించేందుకు తెలంగాణ రాష్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు టాలీవుడ్ ఇండస్ర్టీకి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గారు పరిశ్రమ లో ఉన్న సమస్యల గురించి తెలుసుకుని స్వయంగా ఆయన మన అభివృద్ది కోసం ఎంతో ప్రత్యేకంగా శ్రద్ద తీసుకుని పనిచేస్తున్నారు. ఆయన సినీ పరిశ్రమ పక్షపాతి. అందుకు తలసాని గారికి `మా` తరుపున `మా` అధ్యక్షుడు శివాజీ రాజా కృతజ్ఞతలు` తెలిపారు.













