‘మా’ ఆధ్వర్యంలో ఫిలింఛాంబర్లో ఉచిత వైద్య శిబిరం
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ ఆధ్వర్యంలో శివాజీరాజా అధ్యక్షతన ఫిలింనగర్లోని ఫిలింఛాంబర్లో ఆదివారం నాడు ఉచిత వైద్య పరీక్షల శిబిరం నిర్వహించారు. ఆచార్యక్రియేషన్స్, ఎల్బిట్, డాక్టర్ అగర్వాల్స్, సొసైటీ ఫర్ సోషల్ సైంటిస్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమ నటీనటులు, ఇతర సాంకేతిక సిబ్బంది కోసం ఈ ఉచిత వైద్య పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరంలో రక్తపరీక్షలు, నేత్ర, దంత వైద్య పరీక్షలు చేశారు.
ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ నరేష్, హెల్త్ కమిటీ ఛైర్మన్ నాగినీడు, వైస్ ప్రెసిడెంట్ బెనర్జీ, జాయింట్ సెక్రటరీ ఏడిద శ్రీరామ్, ట్రెజరర్ పరుచూరి వెంకటేశ్వరరావు, కల్చరల్ కమిటీ చైర్మన్ సురేష్ కొండేటి, హరినాధ్ బాబు, వితి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.













