త్వరలో న్యూయార్క్లో సెకండ్ షెడ్యూల్
పెళ్లి చూపులు సినిమాలో హీరోయిన్ తండ్రిగా నటించిన దర్శకుడు అనీష్ కురువిల్లా, అమృతం సీరియల్ ఫేమ్ శివన్నారాయణ నరిపెద్ది కీలక పాత్రధారులుగా వశిష్ట పారుపల్లిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, లోకి ఫిలిమ్స్, బీయంజే స్టూడియోస్ సంస్థలు ఓ సినిమా నిర్మిస్తున్నాయి. అశ్విన్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్లో ముగిసింది. త్వరలో అమెరికాలోని న్యూయార్క్, మియామీ సిటీల్లో సెకండ్ షెడ్యూల్ షూటింగ్ చేయనున్నారు. ఈ చిత్రానికి సాహిత్యం: సర్వసి. హెచ్, సంగీతం: వంశీ-హరి, నిర్మాత: సుదేష్, కథ, కథనం, మాటలు, దర్శకత్వం: వశిష్ట పారుపల్లి.








