33 ఏళ్ల నిరీక్షణ ఫలించింది
సీనియర్ హీరోయిన్ ఖుష్బూకు భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత టీమిండియా కోచ్ రవిశాస్త్రీ అంటే ఎనలేని అభిమానమట. ఎప్పటికైన తన అభిమాన క్రికెటర్‌ను కలుసుకోవాలని ఉండేదట. కానీ అది తీరడానికి ఏకంగా 33 ఏళ్లు పట్టాయాని ఖుష్బూసుందర్ చెప్పింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్చాచ్ అనంతరం ఖుష్బూ రవిశాస్త్రీని కలుసుకుని ఆయనతో ఫోటోలు దిగి తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్టు చేసింది. నా 33 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. నా హీరోను కలుసుకున్నా, నా కల సాకారమైంది అని తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.













