రెండో పెళ్లికి రెడీ?
హీరోయిన్గా టాప్ రేంజ్కి ఎదిగింది. తరువాత సినిమాలు తగ్గడంతో ఇష్టపడి ఓ వ్యక్తిని పెళ్లిచేసుకుంది. కొన్నాళ్లు బాగానే సాగిన వారి కాపురంలో చిచ్చు రగిలింది. అతగాడి వ్యవహారాలు నచ్చక విడిపోయింది. ఇపుడు అతగాడు రెండో పెళ్లి చేసుకున్నాడు. మరి నేనెందులో తక్కువ అంటూ రెండో పెళ్లికి రెడీ అంటోంది ఈ అందగత్తె. ఆమె ఎవరో కాదు, బాలీవుడ్ క్రేజీ మాజీ హీరోయిన్ కరిష్మాకపూర్. బాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా ఎదిగిన కరిష్మా జీవితం పెళ్లి తరువాత అంధకారంలో పడిపోయింది. సంజయ్కపూర్తో జరిగిన పెళ్లి బంధాన్ని ఈ మధ్యనే కరిష్మా తుంచుకోవడంతో, సంజయ్ మరో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు కరిష్మా సైతం అలాంటి ప్రయత్నాల్లోనే ఉందట. చిన్నప్పటి స్నేహితుడు సందీప్ తొష్మితో జోరుగా షికార్లు కొడుతున్న కరిష్మా, త్వరలోనే అతగాడిని పెళ్లి చేసుకోబోతోందని ఇండస్ట్రీ టాక్. ఎప్పుడు ఒక్కటవుతారన్నది వాళ్లే చెప్పాలి.













