కరీనాకు బంపర్ ఆఫర్!
ఒకప్పుడు బాలీవుడ్లో తిరుగులేని స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది కరీనాకపూర్. ఈ అమ్మడు హీరో సైఫ్ అలీఖాన్‌తో వివాహానంతరం కూడా సినిమాల్లో నటించింది. ఆ తర్వాత కొడుకు జన్మనిచ్చిన కరీనా కొంత కాలం సినిమాలకు గ్యాప్నిచ్చింది. ఈమధ్యే ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టిందట. తిరిగి సినిమాల్లోకి రావాలనేది ఆమె తాపత్రయం. ఈ నేపథ్యంలో కరీనాకపూర్‌కు ఓ బంపర్ ఆఫర్ కూడా వచ్చేసిందట. ఈ సినిమా కోసం ఈ స్టార్ బ్యూటీకి ఏకంగా ఆరు కోట్లు కూడా ఆఫర్ చేశాడు నిర్మాతలు. దీంతో కరీనా సినిమాను ఓకే కూడా చేసేసిందట. 36 ఏళ్ల ఈ అందాల తార వీర్ ది వెడ్డింగ్ సినిమా చేయనుంది. ఈ సినిమాను ఏక్తా కపూర, రియాకపూర్లు నిర్మిస్తారు. అల్ట్రా మోడ్రన్ ఉమన్ రోల్లో మెరవడానికి కరీనా ఏకంగా ఆరు కోట్ల రెమ్యునరేషన్ అందుకోవడం ఇప్పుడు బాలీవుడ్లో టాక్ ఆప్ ద ఇండస్ట్రీగా మారింది.













