అవును… నేను పార్టీ పెట్టాలనుకుంటున్నాను
ప్రముఖ నటుడు కమల్‌హాసన్ రాజకీయ రంగ ప్రవేశ విషయంలో సస్పెన్స్ వీడింది. ప్రస్తుతం ఉన్న ఎలాంటి పార్టీలో చేరబోనని, సొంత పార్టీ పెట్టబోతున్నానని ఓ ఇంటర్వ్యూలో కమల్ సృష్టం చేశారు. అయితే తనని ప్రజలు బలవంతం చేయడం వల్లే పార్టీ పెట్టబోతున్నానని ఇష్టంతో కాదని పేర్కొన్నారు. అవును. నేను పార్టీ పెట్టాలనుకుంటున్నాను. కానీ ఇది నా ఇష్ట ప్రకారంగా తీసుకున్న నిర్ణయం కాదు. నాకున్న ఐడియాలతో సరితూగే పార్టీలు తమిళనాడులో ఏమున్నాయి? అన్నారు. అనంతరం శశికళను పార్టీ జనరల్ సెక్రటరీ పదవి నుంచి అన్నాడీఎంకే తొలగించిన విషయమై మాట్లాడుతూ ఇది మంది నిర్ణయం అన్నారు. ఆమెను తప్పించడంలో తమిళనాడు రాజకీయాల్లో మార్పు వస్తుందన్న నమ్మకం మరింత పెరిగిందని చెప్పారు. ప్రస్తుతం తమిళ బిగ్‌బాస్ టీవీ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కమల్ తాను బీజేపీతో చేతులు కలపడంలేదని సృష్టం చేశారు.













