ఎమ్మెల్యే గా నందమూరి కళ్యాణ్ రామ్
నందమూరి కళ్యాణ్ రామ్ ఎమ్మెల్యే కాబోతున్నారు. అదేంటి ఇప్పుడు ఏ ఎన్నికలూ లేవే. ఇప్పుడెలా ఎమ్మెల్యే అవుతారు అనుకుంటున్నారా? రియల్ ఎమ్మెల్యే కాదండి బాబు సినిమాలో ఎమ్మెల్యే కాబోతున్నారు. ఆయన త్వరలో నటించనున్న సినిమాలో ఎమ్మెల్యే పాత్రలో కనిపించబోతున్నారట. ఇజం సినిమా తరువాత దాదాపు ఆరు నెలల పాటు ఏ ప్రాజెక్టును అంగీకరించలేదు. ఇటీవల ఉపేంద్ర అనే కొత్త దర్శకుడి చెప్పిన కథను చేసేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. తన తమ్ముడు ఎన్టీఆర్ హీరోగా చేస్తున్న జై లవకుశ సినిమా నిర్మాణం పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే తనను హీరోగా తెరకెక్కబోయే సినిమాను కూడా పట్టాలెక్కించాలని భావిస్తున్నాడు. కామెడీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కునున్న ఈ సినిమాకు ఎమ్మెల్యే అనే టైటిల్‌ను పెట్టబోతున్నారట.













