మొబైల్ యాప్ను ఆవిష్కరించిన కాజల్
దక్షిణాది నటి కాజల్ ఆగర్వాల్, తన అధికారిక మొబైల్ యాప్ను న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న ఎస్కాపెక్స్తో కలిసి విడుదల చేసింది. తన సోషల్ మీడియా ఖాతాలను అభిమానులతో అనుసంధానించడంతో పాటుగా తనతో అభిమానులు నేరుగా సంభాషించే అవకాశం ఈ యాప్ ద్వారా లభిస్తుందని ఈ సందర్భంగా కాజల్ వ్యాఖ్యానించింది. ఈ యాప్లో వినూత్నమైన ఫీచర్లు, అయిన పుష్ నోటిఫికేషన్స్, వీడియోలు, పోస్ట్స్ కంటెస్ట్స్ తదితరాలు ఉంటాయని పేర్కొంది.







