అలాంటి సన్నివేశాల్లో నటించడానికి సిగ్గేస్తోంది
నాకు చాలా సిగ్గేస్తోందబ్బా అంటున్నారు నటి కాజల్ అగర్వాల్. ఏంటి అబ్బా చా అనాలనిపిస్తోందా? మీరు ఏమైనా అనుకోండి. కాజల్ మాత్రం సిగ్గుతో పాటు, చాలా కష్టపడిపోతున్నారట. ఇంతకి కాజల్ చెప్పొచ్చేదేమిటనేగా మీరు తెలుసుకోవాలనుకుంటోంది. అమ్మడు దక్షిణాదిలో నటించడం మొదలెట్టి దశాబ్దం దాటిపోయింది. ఇన్నాల్టికి ప్రేమ సన్నివేశాల్లో నటించడానికి చాలా సిగ్గేస్తోంది అంటున్నారు. ఆ సంగతేమిటో చుద్దాం రండి. సినిమాల్లో ముద్దు సన్నివేశాల్లో, ప్రేమ సన్నివేశాల్లో నటించడాన్ని ఒకప్పుడు ఎక్కువగా చర్చించుకునే వారు అలాంటి సన్నివేశాల్లో నటించడానికి కథానాయికలు సంశయించేవాళ్లు. అయితే అది రానురాను సర్వసాధారణంగా మారిపోయ్యింది. పొట్టిలంగా ఓణీలు లాంటివి ధరించి లిప్‌లాక్ సన్నివేశాలు, హీరోలతో ప్రేమ సన్నివేశాలల్లో సన్నితంగా నటించడం నాకు మాత్రం చాలా సిగ్గేస్తుంది. కొన్ని సందర్భాల్లో సాధారణ జనం షూటింగ్ చూడడానికి వస్తుంటారు. వారి ముందు అలాంటి సన్నివేశాల్లో నటించడం సాధారణ విషయం కాదు. నేను మాత్రం చాలా కష్టపడతాను. నేను ఈ రంగంలో అడుగు పెట్టి పదేళ్లు దాటింది. ప్రముఖ నటులందరితోనూ కలిసి నటించాను. ప్రస్తుతం తమిళంలో అజిత్‌కు జంటగా వివేకం, విజయ్‌తో ఒక చిత్రం చేస్తున్నాను. తెలుగులో రానాతో కలిసి నేనే రాజా నేనే మంత్రి చిత్రంలో నటిస్తున్నాను. ఇకపై నటనకు అవకాశం ఉన్న పాత్రల్లోనే నటించాలని నిర్ణయించుకున్నానంటున్న కాజల్ ఇంతకు ముందు నేను పక్కాలోకల్ అంటూ ఐటమ్ సాంగ్‌లో ఎలా ఇరగదీసిందో మరి. చెప్పడానికే నీతులు అని పెద్ధోళ్లు ఊరికే అనలేదు మరి.













