త్వరలో జై లవకుశ
జై లవకుశ చిత్రాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించారు. తిరుమల శ్రీవారిని సుప్రభాతం సేవలో సతీసమేతంగా ఆయన దర్శించుకున్నారు. అనంతరం మందిరం ఎదుట మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి సన్నిధిలో జై లవకుశ చిత్రం గురించి ప్రస్తావించదలిచానని పేర్కొన్నారు. ఎన్టీఆర్ వెంట సినీ దర్శకుడు కొరటాల శివ ఉన్నారు.








