జూనియర్ ఎన్టీఆర్ సొంత పార్టీ!
ప్రస్తుతం ఉన్న రాజకీయ వేడిలో ఓ సినిమా నటుడు పార్టీ పెడితే అది సంచలనమే అవుతుంది. నటుడిగా, బిగ్‌బాస్ షోతో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టారంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఇది సినిమాకు సంబంధించిన ఆప్డేట్ కావడంతో అంతా రిలీఫ్‌గా ఫీలయ్యారు. అసలు విషయం ఏమంటే ఎన్టీఆర్ మూడు పాత్రలు పోషిస్తూ నటిస్తున్న చిత్రం జై లవకుశ. ఆయన సోదరుడు నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బాబి దర్శకుడు. ఇటీవల ఇందులోని జై పాత్రకి సంబంధించిన టీజర్ విడదల చేశారు. మిగతా రెండు పాత్రలు ఎలాంటివి అనేక ఆసక్తి అభిమానుల్లో ఉంది. వీటీలో ఒక పాత్ర రాజకీయనాయకుడిగా తేలింది. సమసమాజ్ పార్టీ నేతగా ఎన్టీఆర్ కనింపిచే లుక్ బయటకు వచ్చింది. పార్టీ జెండాలు వాటిపై ఎన్టీఆర్ బొమ్మలు ఉన్నాయి. లీకేజ్ కారణంగానే ఇవి బయటకు వచ్చాయనేది సృష్టమవుతోంది.













