ఇక అవతార్ మాయాజాలం
అవతార్ 2009లో వచ్చిన ఈ చిత్రం ఎంత పెద్ద సూపర్ హిట్టయిందో అందరికీ తెలిసిందే. విజువల్ వండర్‌గా, నిలిచి, ఆస్కార్ అవార్డులను అందుకోవడమే కాకుండా, తెరపై ఎంతటి మాయాజాలాన్ని చూపవచ్చో ప్రపంచానికి చెప్పిన చిత్రమిది. ఆపై ఈ చిత్రం సీక్వెల్ సీరీస్‌ను ప్రారంభించినట్టు దర్శకుడు జేమ్స్ కామెరూన్ ప్రకటించి, పనిలో దిగారు కూడా. ఇక ఈ చిత్రం మరి నాలుగు భాగాలను సిద్ధం చేస్తున్నామని తాజాగా వెల్లడించిన ఆయన వాటి విడుదల తేదీలను ప్రకటించారు. 2020 డిసెంబర్ 18న అవతార్ 2 విడుదలువుతందని, 2021 డిసెంబర్ 17న మూడో భాగం, 2024 డిసెంబర్ 20న నాలుగో భాగం, 2025 డిసెంబరు 19న తుది భాగం విడుదలవుతాయని చెప్పారు. ఈ విడుదల తేదీలన్నీ క్రిస్మస్ పండగ సీజన్లోనే ఉండడం విశేషం.













