నన్ను ఎవరూ కిడ్నాప్ చేయలేదు!
బుల్లితెరలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమంతో మంచి పేరు తెచ్చుకున్న నటుడు వినోద్ కిడ్నాప్ అయ్యారంటూ వచ్చిన వదంతులు బనగానపల్లి నియోజకవర్గంలో కలకలం రేపాయి. వినోద్ తన పెళ్లి చూపుల నిమిత్తం సమీప బంధువుల ఇంటికి తన తల్లి శిరోమణమ్మతో కలిసి సంజామల మండలం బొందలదిన్నె గ్రామానికి వచ్చారు. ఇక్కడ పెళ్లి విషయంలో వివాదం జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో వినోద్ కిడ్నాప్‌కు గురైనట్లు వదంతులు వ్యాపించాయి. సంజామల పోలీసులు అప్రమత్తమై బొందలదిన్నె గ్రామానికి చేరుకుని వినోద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుంచి కోవెలకుంట్ల సీఐ శ్రీనివాసులరెడ్డి వద్దకు తీసుకెళ్లి హాజరుపరిచారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని రాతపూర్వకంగా రాసిఇచ్చారు. తనకు షూటింగ్ ఉందని చెప్పడంతో పోలీసులు వినోద్‌ను వదలిపెట్టారు.













