అణా పైసలతో సహా కట్టేస్తా: ఎన్టీఆర్
కాగ్ నోటీసులపై స్పందించారు టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్. నాన్నకు ప్రేమతో సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్ కు సంబంధించి ట్యాక్స్ విషయంలో ఎన్టీఆర్… కాగ్ నోటీసులు అందుకున్నారు. సుమారు కోటి పది లక్షల రూపాయలు ట్యాక్స్ ఎగ్గొట్టారని నోటీసులో పేర్కొంది ఆర్థికశాఖ. నోటీసుల అంశంపై మాట్లాడుతూ….. తమ సినిమా పూర్తిగా లండన్ లో నిర్మించామని, లండన్ లో తీసిన సినిమాకు భారత్ లో టాక్స్ వర్తించదన్నారు ఎన్టీఆర్. ఇప్పటికే కాగ్ నోటీసులకు తన ఆడిటర్ రిప్లై ఇచ్చినట్టుగా తెలిపారు. ఆదాయపు పన్నుతో పాటు సర్వీన్ టాక్స్ ను కూడా క్రమం తప్పకుండా చెల్లిస్తున్నానని తెలిపిన ఎన్టీఆర్.. భారత పౌరుడిగా చట్టపరమైన బాధ్యతలను ఎప్పుడూ మరవలేదన్నారు. ప్రభుత్వానికి చెల్లించాల్సి వస్తే.. అణాపైసలతో సహా కట్టేస్తా అని స్పష్టం చేశారు. బాధ్యత నుంచి తప్పుకునేది లేదన్నారు.













