ప్రియుడి గురించి ఇలియాన చెప్పిన విషయాలు
సినిమాల గురించే కాదు తన వ్యక్తిగత విషయాలు పంచుకోవడానికి కూడా ఏ మాత్రం సంకోచించదు గోవా బ్యూటీ ఇలియానా. ఆమె ప్రస్తుతం నటిస్తున్న చిత్రం బాద్షాహో. మిలాన్ లుత్రియా దర్శకుడు. ఈ చిత్ర ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇలియానా సినిమా గురించి, తన ప్రియుడు, లండన్‌కి చెందిన ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ గురించి ప్రత్యేకంగా ఓ ఇంటర్య్వూలో వెల్లడించింది. నేను 11 ఏళ్లు చిత్ర పరిశ్రమలో ఉన్నాను. మాకు అభిమానుల నుంచి ఎంతో ప్రేమాభిమానాలు లభిస్తాయి. అదే సమయంలో వారికి మాపై అకారణంగా రెట్టింపు ద్వేషం కూడా కలుగుతుంది. ఇవన్నీ నా బాయ్‌ఫ్రెండ్ అనుభవించాలని నేను అనుకోను. అతను చాలా సాధారణ వ్యక్తి. చాలా మంది అతను భారతీయుడు కాదని, ఎలా ప్రేమించావని అడిగేవారు. అందులో అసలు అర్థం లేదు. అతను నాకెంతో ప్రత్యేకం. ఎలాంటి ప్రమేయం లేకుండా నా కుటుంబం ఆరోపణలు ఎదుర్కోవడం నాకు ఇష్టం లేదు. నాకు సంబంధించి పెళ్లికి, సహజీవనానికి పెద్ద తేడా లేదు. భార్యభర్తలను విడిదీసేది కేవలం ఓ కాగితమే. పెళ్లితో చాలా మంది జీవితాల్లో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. కానీ నా విషయంలో మాత్రం నా ప్రియుడు పట్ల ఉన్న కమిట్మెంట్స్ ఎప్పటికీ మారవు. అని చెప్పుకొచ్చింది ఇలియానా. ఆమె నటించిన బాద్షాహో చిత్రం సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.













