తాను ఎలా వుండాలో ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు
దేవదాసు, పోకిరి చిత్రాలతో తన అందంతో పాటు అభినయాన్ని కూడా ప్రదర్శించి యూత్‌తో పాటు అన్ని వర్గాల వారికి ఆకట్టుకుని దక్షిణాది చిత్రసీమలో ఓ వెలుగు వెలిగింది గోవా భామ ఇలియానా. ఆగ్ర నాయికల్లో ఒకరిగా కొనసాగుతున్న తరుణం లోనే ఇక్కడి అవకాశాల్ని కాదనుకొని బాలీవుడ్‌కు పయనమైంది. హిందీ పరిశ్రమలో తొలి చిత్రం బర్ఫీ ఇలియానాకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఆమెకు ఆశించిన అవకాశాలు రాలేదు. ఐదేళ్లలో ఈ సుందరి కేవలం ఐదు చిత్రాల్లో మాత్రమే నటించింది. ప్రస్తుతం బాలీవుడ్లో ఇలియానాకు అవకాశాలు పూర్తిగా కరువయ్యాయనే చెప్పాలి. ఈ నేపథ్యంలో చేతిలో సినిమాల్లేని ఇలియానా నిత్యం వార్తల్లో నిలిచేందుకు ఈ అమ్మడు సరికొత్త మార్గాల్ని అన్వేషిస్తున్నది. హాట్‌హాట్ ఫొటోషూట్లతో సోషల్‌మీడియాలో దర్శనమిస్తూ కుర్రకారును ఉర్రుతలూగించే పనిలో బిజీగా ఉంది. అందులో బాగంగా ఇటీవల బాత్రూమ్ కొలనులో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
ఈ ఫొటోలపై సోషల్‌మీడియాలో అభిమానులు ఘాలుగా స్పందించారు. సినిమాల్లో సుదీర్ఘకాలంగా వుంటున్న ఇలియానాకు ఇలాంటి ఫోటోలతో దర్శనమిస్తుండడం కరక్ట్ కాదని హితవు పలికారు. దీంతో నెలిజన్ల వ్యాఖ్యలపై ఇలియానా మండిపడింది. తన లైఫ్ తన ఇష్టమని, తాను ఎలా వుండాలో ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదని హెచ్చరించింది. నా కెరీర్ నా ఇష్టం అని ఘాటుగా స్పందించింది.













