రజినీకాంత్ ని కలవాలంటే ఐడీ తప్పనిసరి
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఫోటో దిగాలనుకునే వారు ఇక నుంచి గుర్తింపు కార్డు చూపించాల్సిందే. రజనీతో ఫోటో సెషన్లో పాల్గొనే అభిమానుకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశామని, అవి ఉన్నవారినే అనుమతిస్తామని ఆల్ ఇండియా రజనీకాంత్ అభిమాన సంఘం నాయకులు వీఎం సుధాకర్, శివరామకృష్ణ తెలిపారు. గుర్తింపు కార్డులు లేని అభిమానులు కార్యక్రమానికి రావద్దని సూచించారు.








