వారిద్దరి పెళ్లి తర్వాతే… నేను పెళ్లి చేసుకుంటా
టాలీవుడ్లో బ్రహ్మచారి హీరోలు చాలా మంది ఉన్నారు. మూడు పదుల వయస్సు దాటేసిన ఈ హీరోలను తరచుగా మీడియా అడిగే ప్రశ్న పెళ్ళెపుడు అనీ. దీనికి ఒక్కొక్కరు ఒక విధంగా స్పందిస్తుంటారు. కండలవీరుడు రానాను ఇదే ప్రశ్న అడిగితే ఆసక్తికరమైన కామెంట్ చేశారు. జాతీయ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రానా మాట్లాడుతూ ప్రభాస్, నితిన్ నాకంటే వయసులో పెద్దవాళ్ళు. ముందు వాళ్ల పెళ్లి కానివ్వండి. ఆ తర్వాత నేను పెళ్లి చేసుకుంటాం. ప్రస్తుతం నా వయసు కేవలం 33 మాత్రమే అని వ్యాఖ్యానించారు. నా పెళ్లి గురించి మా ఇంట్లో వాళ్ళే తొందరపెట్టడం లేదు అన్నారు. ప్రభాస్ పెళ్లి బాహుబలి తర్వాత ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ ఇంతరకు దీనికి సంబంధించిన వివరాలేమి వెల్లడికాలేదు. ఇక నితిన్ విషయూనికి వస్తే 34 ఏళ్ల వయసుకు చేరుకున్న నితిన్ తన తాజా చిత్రం లై తర్వాత ఓ ఇంటి వాడు అవుతాడని తెలిసింది.













