‘మహాభారత’ లో నటిస్తా
బాహుబలి 2 ప్రమోషన్ లో బిజీగా ఉన్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రస్తుతం కేరళలో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఈ సందర్భంగా మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో తెరకెక్కుతున్నది ది మహాభారత సినిమాపై స్పందించాడు. 1000 కోట్ల బడ్జెట్ తో అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న మహాభారత లో కీలకమైన భీముడి పాత్రకు మోహన్ లాల్ కరెక్ట్ చాయిస్ అన్నాడు ప్రభాస్. అంతేకాదు ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో మరేదైన పాత్రకు తనను సంప్రదిస్తే అందులో నటించేందుకు సిద్దమే అంటూ ప్రకటించారు. ఇప్పటికే కృష్ణుడి పాత్రకు మహేష్ బాబును సంప్రదించే ఆలోచనలో ఉన్న మహాభారత టీం, ప్రభాస్‌ను ఇతర పాత్రలకు కన్సిడర్ చేస్తారేమో చూడాలి.













