అవును నేను డేటింగ్లో ఉన్నా
కుమారి 21 ఎఫ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది హెబ్బా పటెల్. ఆ తర్వాత పలు క్రేజీ ప్రాజెక్టుల్లో మెరిసి మెప్పించిందీ బ్యూటీ. వాటి మధ్యలో రాజ్‌తరుణ్‌తో డేటింగ్ అంటూ ఆమెపై వార్తలు వచ్చాయి అయితే ఆ డేటింగ్ వ్యవహారంపై ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది హెబ్బా. అవును తాను డేటింగ్లో ఉన్నానని, అయితే రాజ్‌తరుణ్‌తో మాత్రం కాదని తేల్చి చెప్పింది. తానో వ్యక్తితో డేటింగ్లో ఉన్న మాట వాస్తవమేనని, అతడు సినిమా పరిశ్రమకు చెందిన వాడు మాత్రం కాదని చెప్పిది. అతడి వల్లే తాను ఈ స్థాయికి ఎదిగగానని క్లారిటీ ఇచ్చింది. అయితే ఆ రిలేషన్ ఎక్కువ కాలం నిలవలేదని వెల్లడించింది. ఈ విషయం తన ఇంట్లో కూడా తెలుసని వివరించింది. ఇక, రాజ్‌తరుణ్‌తో రిలేషన్‌పైనా స్పందించిన ఆమె, తమ ఇద్దరి మధ్యా అలాంటిదేమీ లేదని, అతడు కేవలం స్నేహితుడేనని, అనవసరంగా తమ ఇద్దరి మధ్యా రకకాల రూమర్లను ప్రచారం చేస్తున్నారని తెలిపింది. బేసిగ్గా మహారాష్ట్ర నుంచి వచ్చాను కాబట్టి ముంబైలో సొంతిల్లు కొనాలన్న కల ఉండేదని కానీ, తెలుగులో అవకాశలు ఎక్కువగా రావడంతో హైదరాబాద్‌లోనే తన సొంతింటిని ఏర్పరచుకోవాలని చూస్తున్నట్లు తెలిపింది.













