హెబ్బాకు భలే చాన్స్!
కుమారి 21 ఎఫ్ తర్వాత హెబ్బాపటేల్‌కు అనూహ్యమైన క్రేజ్ పెరిగింది. ఈ సినిమా తర్వాత ఈమెకు అవకాశాలు క్యూ కట్టాయి. గ్లామర్‌తోపాటు నటిగా గుర్తింపు తెచ్చుకున్న హెబ్బా వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఈ మధ్యే మిస్టర్ సినిమాలో నటించిన ఆమె ప్రస్తుతం అంధగాడు, ఏంజిల్ చిత్రాల్లో నటిస్తోంది. త్వరలోనే విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాల తర్వాత హెబ్బా మరో క్రేజీ ప్రాజెక్టుకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా నూతన దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందే సినిమాలో హీరోయిగా హెబ్బా ఒకే అయింది. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, మరో హీరోయిన్గా ప్రియాంక కనిపించనుందని సమాచారం.













