గ్రీన్ కార్డ్ సాంగ్స్ రిలీజ్..
శత్రఘ్న రాయపాటి, స్టెఫానీ, జోసెలిన్, రెబెక, మిల్లీ కీలక పాత్రధారులుగా రమ్స్ దర్శకత్వం వహించిన చిత్రం గ్రీన్‌కార్డు. చలపతి రావు కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీనివాస్ గుప్తా, మోహన్ ఆర్, నరసింహ, నాగ శ్రీనివాసరెడ్డి నిర్మాతలు. కు(యు.ఎస్), హెన్నీ ప్రిన్స్, ప్రణయ్‌కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటల్ని ఇటీవల హైదారాబాద్‌లో విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ గత పదిహేనేళ్లుగా అమెరికాలో నేను పరిశీలించిన పరిస్థితులు ఆధారంగా ఈ కథ రాశా. వీసా తీసుకుని అమెరికా వెళ్లి ఇబ్బందులు పాలైన ఓ కుర్రాణి కథే ఈ సినిమా. అమెరికాలో గన్ కల్చర్ కనిపించకూడదని తెలిపే సినిమా ఇది అని అన్నారు.








