నందిని సిధారెడ్డికి ఫిల్మ్ చాంబర్ సన్మానం
తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆద్వర్యంలో తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన డా.నందిని సిధారెడ్డి ని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్లో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ఫిల్మ్ చాంబర్ చైర్మన్ ప్రతాని రామక్రిష్ణ గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి ఆలోచనతో నందిని సిద్దారెడ్డిని సాహిత్య అకాడమి చైర్మన్గా నియమించడం వల్ల తెలుగు భాషకు న్యాయం జరుగుతుందని, తెలుగు సినిమాకు మంచి సపోర్ట్ దొరుకుతుందని వీరిని నియమించినందుకు సినిమా ఇండస్ట్రీకి మంచి జరుగుతుందని అన్నారు.
దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ నందిని సిధారెడ్డి సాహిత్య సేవలను కొనియాడారు. తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ గా కూడా విజయం సాధించాలని అన్నారు. చేనేత కార్మికులపైన అధ్బుతమైన పాట రాయడం వారి జీవన విదానాన్ని కళ్ళకు కట్టినట్టు రాసి ఎందరో హ్రృదయాలను దొచ్చుకున్న కవి అన్నారు. నందిని సిధారెడ్డి మాట్లాడుతూ ఈ తెలంగాణ రాష్ట్రాంలో ముఖ్యమంత్రి కనుసన్నలతో ఈ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంతో అభివృద్ధి చెందుతుంది. నాకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి అజన్మాతరం రుణపడి వుంటాను. తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆధ్వర్యంలో జరిగిన నా మొదటి సన్మానం అధ్యక్షులు రామక్రిష్ణ గౌడ్ గారికి సభ్యులందరికి కృతజ్ఞతలు అన్నారు.













