ఫ్యాషన్ డిజైనర్ s/o లేడీస్ టైలర్ మూడవ పాట రిలీజ్ చేసిన ‘లేడీస్ టైలర్’ రచయిత
ముప్పై సంవత్సరాల క్రితం అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ‘లేడీస్ టైలర్’ చిత్ర౦ మాటల రచయిత తనికెళ్ళ భరణి, ఇప్పుడు ఆ లేడీస్ టైలర్ కు సీక్వెల్ గా వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫ్యాషన్ డిజైనర్ s/o లేడీస్ టైలర్’ మూడవ పాటను విడుదల చేసారు. ‘అన్వేషణా…’ అనే ఈ పాటను శ్రీవల్లి రాయగా, దినకర్, మాళవిక పాడారు.
ఈ సందర్భంగా తనికెళ్ళ భరణి మాట్లాడుతూ, “లేడీస్ టైలర్ నా జీవితానికి సంబంధించి ఒక మూల స్తంభం. కొత్త తరహా చిత్రాలకి కేర్ అఫ్ అడ్రస్ గా నిలిచి, వంశీ తీసిన ‘లేడీస్ టైలర్’ ఇప్పుడు చూసినా కొత్త అనుభూతి నిస్తుంది. అలాంటి లేడీస్ టైలర్ సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ‘ఫ్యాషన్ డిజైనర్ s/o లేడీస్ టైలర్’ మూడో పాట రిలీజ్ చేయటం నా అదృష్టం. ఈ సినిమా ఖచ్చితంగా నిర్మాత మధుర శ్రీధర్ కి ఇక మధురమైన అనుభూతిలా మిగిలిపోవడం ఖాయం. వంశీ ప్రత్యేకత పాటలు. అలాంటి వంశీ, మణిశర్మ కలయికలో మొదటి కాంబినేషన్ చాలా బాగుంది. లిరిక్ చాలా పొయేటిక్ గా వుంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ… శివోహం” అన్నారు.
మధుర ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్లో నిర్మించిన ఈ చిత్రం వేసవి కానుకగా మే చివరి వారంలో ప్రేక్షకుల ముందుకి రానుంది. గత వారం విడుదలైన ‘రవివర్మ చిత్రమా…’ అనే రెండవ పాట, అంతకుముందు విడుదల అయిన ‘పాపికొండల్లో’ అనే మొదటి పాట ఇప్పటికే ప్రేక్షక ఆదరణ పొంది, టాప్ ఫైవ్ చార్ట్ బస్టర్స్ లో నిలిచాయి.
తారాగణం:
సుమంత్ అశ్విన్, అనీషా ఆమ్రోస్, మనాలి రాథోడ్, మానస హిమవర్శ, కృష్ణ భగవాన్, రాఘవేంద్ర… తదితరులు.
సినిమా సాంకేతిక వర్గం:
సంగీతం: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: నగేష్ బన్నెల్, ఎడిటర్: బస్వా పైడి రెడ్డి, ఆర్ట్: డి. వై. సత్య నారాయణ, మాటలు: కళ్యాణ్ రాఘవ్, పాటలు: శ్రీమణి, చైతన్య ప్రసాద్, శ్రీ వల్లి.













