అభిమానులను మళ్లీ నిరాశ పర్చిన సూపర్ స్టార్
సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆయన అభిమానులను మళ్లీ నిరాశ పర్చారు. ఏప్రిల్ 2న రాజకీయ రంగప్రవేశంపై కీలక నిర్ణయం తీసుకుంటారని భావించిన అభిమానులకు ఆయన నిరాశనే మిగిల్చారు. అభిమానులకు, తమ హీరో మీద అభిమానం ఎంత వుంటుందో తేడా వస్తే, అంతకన్నా దారుణంగా వ్యవహారాన్ని తేడా చేసేయగల అసహనం కూడా అంతే వుంటుంది వారిలో. అయితే, ఈ విషయంలో మాత్రం రజనీకాంత్ అభిమానులకు ఒకింత సంయమనం పాటిస్తుండడం విశేషం మరి. ప్రతిసారి ఇలాగే చేస్తే మాత్రం మళ్లీ ఆయన సీరియస్‌గా పిలిచినా రాకపోవచ్చు. ఇదిలా వుంటే, అత్యున్నత స్థాయిలో వచ్చిన ఒత్తిడి నేపథ్యంలోనే రజనీకాంత్ రాజకీయ ప్రకటనపై నిర్ణయం వెనక్కి తీసుకున్నారన్నది తమిళ రాజకీయాల్లో విన్పిసోన్న హాట్ గాసిప్.













