కళాతపస్వికి స్వర్ణకంకణం
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శ్రీ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో నవరస నటసమాఖ్య 19వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కళాతపస్వి పద్మశ్రీ డాక్టర్ కె.విశ్వనాథ్‌ను స్వర్ణకంకణం, గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ మాంగటి మురళీమోహన్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మేయర్ రజనీ శేషసాయి హాజరయ్యారు.








