నాని ‘ఎం.సి.ఎ’ డిసెంబరు 21న విడుదల
నేచురల్ స్టార్ నాని, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబినేషన్లో రూపొందుతోన్న ‘ఎంసీఏ’. ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ అనేది ఉపశీర్షిక. షూటింగ్ 50 శాతం పూర్తయింది. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతోన్న సినిమా ఇది. ఈ సంస్థలో ఇటీవల `ఫిదా`తో తెలుగువారి మనసుల్ని దోచుకున్న సాయిపల్లవి తొలిసారి నానితో జోడీకడుతున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు. ‘నిన్ను కోరి’ హిట్ అనంతరం నాని నటిస్తున్న చిత్రమిది. దీని తర్వాత ఆయన ‘కృష్ణార్జున యుద్ధం’లో నటించనున్నారు. ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తోంది.








