Devi Sri Prasad: నమ్మకాన్ని నిలబెట్టుకున్న దేవీ శ్రీ ప్రసాద్
గత కొన్నేళ్లుగా టాలీవుడ్ లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు దేవీ శ్రీ ప్రసాద్(Devi Sri Prasad). కానీ గత కొంతకాలంగా దేవీ నుంచి తన స్థాయి మ్యూజిక్ రావడం లేదనే మాట ఎక్కువగా వినిపిస్తుంది. ఈ మధ్య దేవీపై, తన మ్యూజిక్ పై నెగిటివ్ కామెంట్స్ బాగా వినిపిస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో దేవీ శ్రీ నుంచి తండేల్(Thandel) సినిమా వచ్చింది.
ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చిన పాటలు ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి. బుజ్జితల్లి(Bujji Thalli) సాంగ్‌తో మొదలై, నమో నమః(Namo Namah), హైలెస్సా(Hilessa) సాంగ్స్ ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో తెలిసిందే. ఇప్పుడు తండేల్ రిలీజయ్యాక థియేటర్లలో కూడా దేవీ తన మ్యూజిక్ తో సినిమాను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాడని టాక్ వినిపిస్తుంది. దేవీ తన బీజీఎంతో ఆడియన్స్ తో ప్రతీ సీన్‌కు థియేటర్లలో విజిల్స్ వేయిస్తున్నాడట. సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ తండేల్ కు దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్, బీజీఎం చాలా ప్లస్ అని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
అయితే మొదట్లో ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎవరిని తీసుకోవాలా అనుకుంటున్న టైమ్ లో పుష్ప2తో బిజీగా ఉన్నాడని దేవీశ్రీని వద్దనుకున్నానని, కానీ అల్లు అర్జున్ మాత్రం తండేల్కు దేవీ శ్రీ మాత్రమే న్యాయం చేయగలడనిని తండేల్ బాధ్యతను దేవీకి అప్పగించేలా చేశాడని అల్లు అరవింద్(Allu Aravind) ఇప్పటికే చెప్పాడు. ఇప్పుడు థియేటర్లలో రెస్పాన్స్ చూసి అల్లు అర్జున్(Allu Arjun) నమ్మకాన్ని దేవీ నిలబెట్టుకున్నాడని అందరూ దేవీని ప్రశంసిస్తున్నారు.













