Devi Sri Prasad: రేటు పెంచిన దేవీ
టాలీవుడ్లో తనదైన శైలితో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్(Devi Sri prasad) రెమ్యూనరేషన్ విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ సాగుతోంది. వరుస బ్లాక్‌బస్టర్ ఆల్బమ్స్‌తో టాప్ లీగ్‌లో కొనసాగుతున్న ఆయన, పుష్ప2(Pushpa2) కు ముందు వరకు సుమారు రూ.6 కోట్ల పారితోషికం తీసుకునేవారని సమాచారం. అయితే తాజా అప్డేట్ ప్రకారం, ఇకపై కొత్త ప్రాజెక్టుల కోసం రూ.12 కోట్లు ప్లస్ జీఎస్టీ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ పెంపు నిర్మాతలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఓవర్సీస్ మార్కెట్, ఆడియో స్ట్రీమింగ్ రెవెన్యూ, డిజిటల్ హక్కుల విలువ పెరుగుతున్న నేపథ్యంలో డీఎస్పీ తన బ్రాండ్ వాల్యూకు తగిన రేటు కోరుతున్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి
ఇదే సమయంలో సౌత్‌లో మరో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్న అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichander) ఒక్కో సినిమాకు రూ.15 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నారని ట్రేడ్ అంచనా. ముఖ్యంగా ఆయన సంగీతం ఉన్న సినిమాల ఆడియో హక్కులే భారీగా అమ్ముడవుతుండటంతో నిర్మాతలు ఆ మొత్తాన్ని సులభంగా రికవర్ చేసుకుంటున్నారు. అయితే డీఎస్పీ విషయంలో అలాంటి స్పష్టమైన మార్కెట్ గ్యారెంటీ ప్రస్తుతం కనిపించకపోవడం నిర్మాతల్లో ఆలోచన కలిగిస్తోంది. ఫలితంగా కొంతమంది దర్శకులు, నిర్మాతలు ఇప్పుడు తక్కువ బడ్జెట్లో మంచి అవుట్‌పుట్ ఇస్తున్న ఇతర సంగీత దర్శకుల వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
ఇక ప్రస్తుత ప్రాజెక్టుల విషయానికి వస్తే, డీఎస్పీ ఉస్తాద్ భగత్‌సింగ్(Ustaad Bhagath Singh) కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తూ బిజీగా ఉన్నారు. అలాగే రామ్ చరణ్(ram charan)- సుకుమార్(Sukumar) కాంబినేషన్లో రాబోయే భారీ ప్రాజెక్ట్ కూడా ఆయన చేతిలోనే ఉందని తెలుస్తోంది. మరోవైపు ఎల్లమ్మ (yellamma) అనే సినిమాతో హీరోగానూ కొత్త అడుగు వేస్తున్నారు. అయితే పెంచిన పారితోషికం కారణంగా కొత్త సినిమాలు వెంటనే ఆయన ఖాతాలో చేరకపోవడం గమనార్హం. రాబోయే నెలల్లో డీఎస్పీ నిర్ణయం ఇండస్ట్రీలో ఎలాంటి మార్పులకు దారితీస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి








