కేన్స్‌లో మెరిసిన దీపికా పదుకునే
ప్రతిష్ఠాత్మక 70వ కేన్స్ చలన చిత్రోత్సవ సందడి మొదలైంది. తొలిరోజు బాలీవుడ్ మస్తానీ దీపిక పదుకొణె ర్యాంప్ వాక్‌తో హోయలొలికించింది. పర్పుల్ రంగు మార్చెసా గౌనులో ఆకట్టుకుంది. దే గ్రిసొగొనో జ్యువెలరీ స్టూడియెస్ డిజైన్ చేసిన చెవిరింగులు, ఉంగరం, కళ్లకు నీలిరంగు మేకప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 2017 కేన్స్ ఉత్సవంలో తొలిరోజు ర్యాంప్ వాక్ చేసిన తొలి భారతీయ నటి దీపిక కావడం విశేషం. అంతేకాదు దీపిక కేన్స్‌లో పాల్గొనడం కూడా ఇదే మొదటిసారి.








