పద్మావతి లుక్ లో దీపికా అదుర్స్…
బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చారిత్రాత్మక చిత్రం పద్మావతి. ఈ చిత్రంలో షాహిద్ కూప్ , దీపిక పదుకొణే, రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దీపిక ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తోండగా, ఈమె భర్త రాజా రావల్ సింగ్ పాత్రలో షాహిద్ కపూర్ నటిస్తున్నారు. రణవీర్ సింగ్ విలన్గా అల్లావుద్దీన్ ఖిల్జీ రోల్ లో కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 1న విడుదల చేసేందుకు ప్లాన్ చేసిన చిత్ర యూనిట్ కొద్ది సేపటి క్రితం ఫస్ట్ లు క్ విడుదల చేసింది. పద్మావతి రాజఠీవీలో కూడిన లు క్లో దీపిక అదిరిపోయిందని అంటు న్నారు. ఒంటి నిండా నగలతో లెహంగాని ధరించి అచ్చం పద్మావతి అవతారంలో దీపిక ఒదిగిపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.













