దీపిక పదుకొణెకు మరో అరుదైన గౌరవం
బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దీపికా పదుకొణెకు మరో అరుదైన గౌరవం దక్కింది. అకాడెమీ సభ్యురాలిగా ఆమె నామినేట్ అయింది. ఆస్కార్ అవార్డులను అందించే అకాడెమీలో జాయిన్ కావాలంటూ ఇన్విటేషన్లు వచ్చిన ఇతర బాలీవుడ్ ప్రముఖుల్లో అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, ఐశ్వర్యారాయ్ బచ్చన్, గౌతమ్ ఘోష్, బుద్ధదేవ్ దాస్ గుప్తా, సల్మాన్ ఖాన్, ఇర్ఫాన్ ఖాన్ కూడా ఉన్నార. అకాడమీ మెంబర్గా ఎంపిక కావడం పట్ల దీపిక సంతోషం వ్యక్తం చేసింది. ఇది తనకు దక్కిన గౌరవం అని దీపిక ట్వీట్ చేసింది.








