దీపిక పై మళ్లీ ధ్వజమెత్తిన నెటిజన్స్
సోషల్‌మీడియా పుణ్యమా అని మన అభిమాను నటీనటులతో ఎల్లప్పుడూ టచ్‌లో ఉండే అవకాశం దక్కింది. కానీ ఇప్పుడు అదే సోషల్‌మీడియాను సెలబ్రెటీలపై కామెంట్లు చేయడానికి వినియోగిస్తున్నారు నెటిజన్లు. దాంతో ఏం పోస్ట్ చేస్తే ఎలాంటి కామెంట్స్ వస్తాయోనని సెలబ్రెటీలు జంకుతున్నారు. ఇంతకీ విషయమేంటంటే బాలీవుడ్ భామ దీపిక పదుకొణెపై నెటిజన్లు మళ్లీ ద్వజమెత్తారు. ఇదివరకు దీపిక మ్యాక్సిమ్ మ్యాగజీన్ కోసం వేసుకున్న దస్తులను తప్పుబడుతూ నీకు భారతీయ సంప్రదాయం నేర్పింది ఇదేనా అంటూ దీపికపై కామెంట్లు వర్షం కురింపించారు. తాజాగా వ్యానిటీ ఫెయిర్ మ్యాగజీన్ కోసం దీపిక ఫొటోషూట్ ఇచ్చింది. ఈ ఫొటోలను దీపిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అంతే బక్క చిక్కిపోయినట్లున్నావ్ అంటూ దీపికపై మరో రకంగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు, కొందరేమో దీపిక బాగా తినాలి అని కామెంట్లు పెడుతుంటే మరికొందరు ఏకంగా ఎలాంటి తిండి తినాలో కూడా సలహాలు ఇచ్చేస్తున్నారు.








